వైఎస్ వివేకా హత్య కేసు.. భాస్కర్ రెడ్డికి షాక్
- బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన తెలంగాణ హైకోర్టు
- ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ కూ నిరాకరణ
- చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా భాస్కర్ రెడ్డి, ఉదయ్
వైఎస్ వివేకా హత్య కేసు విచారిస్తున్న సీబీఐ అధికారులు ఈ ఏడాది ఏప్రిల్ 16న వైఎస్ భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. పులివెందుల లోని భాస్కర్ రెడ్డి నివాసానికి వెళ్లి అరెస్టు చేశారు. అంతకుముందే గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు వారిద్దరినీ చంచల్ గూడ జైలుకు తరలించారు. దీంతో బెయిల్ కోసం భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ విడివిడిగా బెయిల్ పిటిషన్లు దాఖలు చేసుకోగా.. కింది కోర్టు తిరస్కరించింది. కింది కోర్టు తీర్పును నిందితులు హైకోర్టులో సవాల్ చేశారు. ఈ అప్పీల్ పై తెలంగాణ హైకోర్టు సోమవారం విచారించింది. ఇరువైపుల వాదనలు విన్నాక నిందితుల బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది.