పవర్ ఫుల్ లుక్ లో పవన్.. 'హరిహరవీరమల్లు' పోస్టర్ విడుదల
- జనసేనాని పవన్ కల్యాణ్ పుట్టినరోజు నేడు
- అర్ధరాత్రి 12.17 గంటలకు పోస్టర్ విడుదల
- గుబురు గడ్డంతో, సీరియస్ లుక్ లో ఉన్న పవన్
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎన్నికల లోపు ఈ సినిమాను పవన్ పూర్తి చేస్తారని తెలుస్తోంది. మరోవైపు పోస్టర్ రిలీజ్ సందర్భంగా చిత్ర యూనిట్ పవన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. అసాధారణ ధైర్యసాహసాలు, దయ, అపరిమితమైన కరుణ కలిగిన పవన్ పుట్టినరోజును ఈ సంతోషకమైన రోజున జరుపుకుంటున్నామని ట్వీట్ చేసింది.