‘సలార్’ కోసం శ్రుతి హాసన్ సాహసం
- ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించిన శ్రుతి
- ఐదు భాషల్లో తన పాత్రకు తానే డబ్బింగ్ చెబుతున్ననటి
- సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల
ఈ సినిమా నుంచి శ్రుతికి సంబంధించిన ఆసక్తికర సమాచారం బయటికి వచ్చింది. ఇందులో తన పాత్రకు శ్రుతినే డబ్బింగ్ చెబుతోంది. ఇందులో కొత్తేమిటంటారా? ఉంది. ఐదు భాషల్లో వస్తున్న ఈ చిత్రంలో అన్నింటికి శ్రుతి డబ్బింగ్ చెబుతోంది. ఇప్పటికే మూడు భాషల డబ్బింగ్ పనులు పూర్తి చేసింది. మరో రెండింటివి కూడా పూర్తి చేసే పనిలో ఉంది. సాధారణంగా ఇతర భాషల్లో డబ్బింగ్ చెప్పుకునేందుకు హీరోయిన్లు వెనుకాడుతారు. కానీ, శ్రుతి ఏకంగా ఐదు భాషల్లో సొంత గొంతు వినిపించే సాహసం చేయనుంది.