ఇప్పటిదాకా లవర్ బాయ్‌లా చూశారు.. ఇప్పుడు యాక్షన్ లుక్‌లో సర్ప్రైజ్ చేస్తా: దుల్కర్ సల్మాన్
- దుల్కర్ హీరోగా నటించిన తాజా చిత్రం కింగ్ ఆఫ్ కోథా
- ఈ నెల 25న విడుదల కాబోతున్న చిత్రం
- వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘లక్కీ భాస్కర్’ చేస్తున్న దుల్కర్
నటుడిగా కొత్త తరహా కథల కోసం అన్వేషిస్తున్నానని తెలిపాడు. వెరైటీ పాత్రల కోసం ఎదురు చూస్తున్న క్రమంలో ‘కింగ్ ఆఫ్ కోథా’ తన దగ్గరకు వచ్చిందని చెప్పాడు. ‘ఏడాదికి మూడు సినిమాలు చేసే నేను ఈ ఒక్క సినిమా కోసం ఏడాది పాటు కష్టపడ్డా. ఇప్పటివరకు నేను ఇలాంటి సినిమా చేయలేదు. పాటలు, యాక్షన్, ఫుట్ బాల్ సీక్వెన్స్‌లు చాలా బాగుంటాయి. తెలుగు, తమిళ, మలయాళ.. మూడు భాషల్లోనూ నేను డబ్బింగ్ చెప్పాను’ అని దుల్కర్ చెప్పుకొచ్చాడు. తెలుగులో సినిమాలు చేయడం తనకు ఇష్టమన్న దుల్కర్ ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘లక్కీ భాస్కర్’ సినిమా చేస్తున్నానని, మరికొన్ని కథలు కూడా వింటున్నానని తెలిపాడు.