దేశంలోనే తొలి త్రీడీ పోస్టాఫీస్ బిల్డింగ్.. ప్రింటింగ్ వీడియో ఇదిగో!
- త్రీడీ పోస్టాఫీసును ప్రారంభించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- కేవలం 45 రోజుల్లోనే పూర్తయిన వెయ్యి చదరపు అడుగుల బిల్డింగ్
- బెంగళూరులోని హాలాసూర్ లో ప్రారంభోత్సవం
బిల్డింగ్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రశంసలు కురిపించారు. ప్రధాని చేపడుతున్న అభివృద్ధి పనులకు ఈ బిల్డింగ్ ఒక నిదర్శనమని చెప్పారు. దేశానికి కొత్తదనాన్ని పరిచయం చేయడంలో బెంగళూరు ముందు ఉంటుందని, త్రీడీ పోస్టాఫీసు బిల్డింగ్ తో దేశానికి స్ఫూర్తిగా నిలిచిందని కొనియాడారు. యావత్ దేశం ఇదే స్ఫూర్తితో పురోగమిస్తోందని పేర్కొన్నారు. కాగా, ఈ ఏడాది ఏప్రిల్ లో తాము ప్రతిపాదించిన త్రీడీ బిల్డింగ్ ప్లాన్ కు బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ టెక్నాలజీ ప్రమోషన్ కౌన్సిల్ (బీఎంటీపీసీ) ఆమోదం తెలపగా.. ఐఐటీ మద్రాస్ సహకారంతో పూర్తిచేసినట్లు ఎల్ అండ్ టి కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.