సమంత చేసిన ఘాటు వ్యాఖ్యలు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ను ఉద్దేశించేనా?
- సమంత, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో 'ఖుషి'
- ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు సమంత హాజరుకాకపోవడంతో విజయ్ ఫ్యాన్స్ విమర్శలు
- మీ కోసం మీరు బతకండన్న సమంత
ఈ నేపథ్యంలో, సోషల్ మీడియా ద్వారా సమంత ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ లోకం కోసం మీరు బతకాల్సిన అవసరం లేదని, మీరు మీ కోసం బతకండని సామ్ మండిపడ్డారు. ఈ సమాజం మిమ్మల్ని గుర్తించకపోవచ్చని, మీ గౌరవం ఏమిటో తెలుసుకుని, మీ స్థాయిని పెంచుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. పది మందిలో ఒకరిలా కాకుండా ఒక ప్రత్యేకమైన గుర్తింపుతో బతికేందుకు ప్రయత్నించండని వ్యాఖ్యానించింది. అయితే, ఈ కామెంట్స్ ఎవరి గురించి చేసిందో మాత్రం సమంత చెప్పలేదు. అయినప్పటికీ విజయ్ దేవరకొండ ఫ్యాన్ ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని సినీ అభిమానులు భావిస్తున్నారు.
మరోవైపు 'ఖుషి' మూవీ సెప్టెంబర్ 1న విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. విజయ్ దేవరకొండకు 'లైగర్', సమంతకు 'శాకుంతలం' చేదు అనుభవాన్ని మిగిల్చాయి. దీంతో, వీళ్లిద్దరూ కమ్ బ్యాక్ కావడానికి 'ఖుషి' హిట్ కొట్టడం చాలా అవసరం.