చిరంజీవి 'భోళాశంకర్'కు సమస్యలు తప్పవు.. విజయసాయిరెడ్డికి బుద్ధి ఉందా?: రఘురామకృష్ణ రాజు
- చిరంజీవిపై వరుసగా విమర్శలు గుప్పిస్తున్న ఏపీ మంత్రులు
- చిరంజీవి మాట్లాడిన దాంట్లో తప్పేముందన్న రఘురాజు
- జగన్ సంపాదనను 151 మంది ఎమ్మెల్యేలకు పంచమంటే ఎలా ఉంటుందని ప్రశ్న
తమ పార్టీ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభలో రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడకుండా... సినీ నటుల రెమ్యునరేషన్ గురించి మాట్లాడటం ఏమిటని రఘురాజు విమర్శించారు. విజయసాయికి బుద్ధి ఉందా? అని ప్రశ్నించారు. హీరోల స్థాయిని బట్టి వారి రెమ్యునరేషన్ ఉంటుందని చెప్పారు. సీఎం జగన్ వేల కోట్లు సంపాదించారని అందరూ అంటుంటారని... ఆయన సంపాదించిన మొత్తాన్ని 151 మంది ఎమ్మెల్యేలకు పంచమంటే ఎలా ఉంటుందని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రజలు వరదలతో అల్లాడుతుంటే దాన్ని పట్టించుకోకుండా... మంత్రి అంబటి రాంబాబు 'బ్రో' సినిమాపై ఢిల్లీలో ఫిర్యాదు చేయడం ఏమిటని మండిపడ్డారు. ఆ సినిమాలో ఉన్న ఏదో చిన్న క్యారెక్టర్ కు అంబటి ఎందుకు అంతలా ఫీల్ అవుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు.