మరో బ్లాక్ బస్టర్ సినిమా సీక్వెల్‌తో వస్తున్న కార్తీ
- తమిళ్, తెలుగులో కార్తీకి మంచి ఫాలోయింగ్
- ఆయన హీరోగా నటించిన సర్దార్ చిత్రం సూపర్ హిట్
- రెండో పార్టులో విలన్‌గా నటించనున్న విజయ్ సేతుపతి
పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన తొలి పార్టులో స్పై థ్రిల్లర్‌లో కార్తీ తండ్రి, కొడుకు పాత్రల్లో నటించి మెప్పించాడు. మిత్రన్ దర్శకత్వంలోనే ఈ సినిమా రెండో పార్టుకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. మొదటి పార్టుకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా సీక్వెల్‌కు యువన్ శంకర్ రాజాను తీసుకున్నారు. ఇక, ఈ సినిమాలో విలన్‌గా విజయ్ సేతుపతి నటించనున్నారు. ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. ‘ఖైదీ 2’ కంటే ముందే సర్దార్2 ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం కార్తీ హీరోగా నటిస్తున్న ‘జపాన్’ చిత్రం ఈ దీపావళికి విడుదల కానుంది.