'జైలర్' నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్!
- 'జైలర్' పై పెరుగుతున్న అంచనాలు
- ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తున్న భారీ తారాగణం
- హైలైట్ గా నిలవనున్న అనిరుధ్ సంగీతం
- ఆగస్టు 10వ తేదీన సినిమా విడుదల
'రా .. దాచుంచారా పరువాలన్నీ .. రాబరీకి రావే రావే, రా .. అందిస్తారా అందాలన్నీ .. ఎప్పటికీ నీవే నీవే, రావు .. నువ్వు కావాలయ్యా .. ' అంటూ ఈ రొమాంటిక్ సాంగ్ సాగుతోంది. రజనీ .. తమన్నా బృందంపై ఈ పాటను ప్రత్యేకమైన సెట్ లో కలర్ ఫుల్ గా చిత్రీకరించారు. జానీ మాస్టర్ కంపోజ్ చేసిన డాన్స్ ఆకట్టుకునేలా ఉంది.
అనిరుధ్ స్వరపరిచిన ఈ పాటకి సాయికిరణ్ సాహిత్యాన్ని అందించగా, సింధుజా శ్రీనివాసన్ ఆలపించారు. ఈ పాటలో రజనీ మరింత స్టైల్ గా కనిపిస్తున్నారు. థియేటర్లో మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలానే ఈ పాట ఉంది. భారీతారాగణంతో రూపొందిన ఈ సినిమాను, ఆగస్టు 10వ తేదీన విడుదల చేయనున్నారు.