'భగవంత్ కేసరి' రిలీజ్ డేట్ ఖరారు .. ఆసక్తిని రేపుతున్న న్యూ పోస్టర్!
- 'భగవంత్ కేసరి'గా బాలకృష్ణ
- ముఖ్యమైన పాత్రల్లో కాజల్ - శ్రీలీల
- ఫ్యామిలీ ఎమోషన్స్ నేపథ్యంలో నడిచే కథ
- విలన్ గా తెలుగు తెరకి అర్జున్ రాంపాల్ పరిచయం
- అక్టోబర్ 19వ తేదీన విడుదల కానున్న సినిమా
ఇక బాలయ్య సరసన కథానాయిక పాత్రను కాజల్ పోషించింది. బాలయ్య సరసన నటించడం ఆమెకి ఇదే మొదటిసారి. అలాంటి ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఖరారు చేసుకుంది. ఈ సినిమాను అక్టోబర్ 19వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ లో, భారీ గన్స్ తో కనిపిస్తున్న బాలయ్య యాక్షన్ లుక్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. మరో ముఖ్యమైన పాత్రలో ప్రియాంక జవాల్కర్ కనిపించనుండగా, ప్రతినాయకుడిగా అర్జున్ రాంపాల్ తెలుగు తెరకి పరిచయమవుతున్నాడు. ఈ దసరాకి ఈ సినిమా సంచలనానికి తెరతీస్తుందేమో చూడాలి.