పెట్రోల్ ధరల్లో దేశంలో ఆంధ్రప్రదేశ్ టాప్: లోక్ సభలో కేంద్రం
- దేశవ్యాప్తంగా ఒకే చమురువిధానం ఇప్పటి వరకు లేదన్న కేంద్రమంత్రి
- డీజిల్ ధరల్లో మొదటి స్థానంలో లక్షద్వీప్, రెండో స్థానంలో ఏపీ
- తెలంగాణలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ రూ.97.82
ఇంధన ధరల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. పెట్రోల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ కు నివేదికను ఇచ్చింది. ఏపీలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.87, లీటర్ డీజిల్ ధర రూ.99.61గా ఉన్నట్లు తెలిపింది. పెట్రోల్ ధరల్లో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో ఉండగా, డీజిల్ ధరల్లో లక్షద్వీప్ తొలి స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ డీజిల్ ధరల్లో రెండో స్థానంలో ఉంది. కాగా, అమరావతినే రాజధానిగా పరిగణించి కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలను సేకరించింది. ఇక తెలంగాణలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66గా, డీజిల్ రూ.97.82గా ఉంది.