'అన్నపూర్ణ ఫొటో స్టూడియో' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే..!
- గ్రామీణ నేపథ్యంలో 'అన్నపూర్ణ ఫొటో స్టూడియో'
- 1980లలో నడిచే ప్రేమకథ
- రేపు జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్
- ఈ నెల 21వ తేదీన విడుదలవుతున్న సినిమా
చెందు ముద్దు దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటుకు ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 19వ తేదీన హైదరాబాద్ - జూబ్లీహిల్స్ లోని హోటల్ 'దసపల్లా'లో, విష్వక్సేన్ ముఖ్య అతిథిగా ఈ వేడుకను నిర్వహించనున్నారు.
1980ల కాలం అంటే .. టీవీలు .. మొబైల్ ఫోన్లు తెలియని కాలం. వేషధారణ విషయంలోను .. హెయిర్ స్టైల్ విషయంలోనూ అమ్మాయిలు - అబ్బాయిలు ఫాలో అయిన స్టైల్ వేరు. అమ్మాయిలు ఇల్లొదిలి పెద్దగా బయటికి రాని ఆ కాలంలో సాగిన ప్రేమాయణాలు వేరు. అలాంటి నేపథ్యంలో వచ్చే ఈ సినిమాపై, యూత్ లో మంచి అంచనాలు ఉన్నాయి.