అమెరికాలో మొదలైన ప్రభాస్ 'ప్రాజెక్ట్ కే' సందడి.. భారీ కార్ల ర్యాలీ.. వీడియో ఇదిగో
- కార్ల ర్యాలీ నిర్వహించిన సెయింట్ లూయిస్, మిస్సోరి రాష్ట్రాల అభిమానులు
- ఈ నెల 20న విడుదల కానున్న సినిమా గ్లింప్స్
- ఇప్పటికే సినిమాపై నెలకొన్న భారీ అంచనాలు
ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రూ. వెయ్యి కోట్ల క్లబ్ లో ఈ సినిమా చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో దీపిక ఫస్ట్ లుక్ ను నిన్న రాత్రి మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమలహాసన్ వంటి దిగ్గజాలు నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా... నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు.