ప్రభాస్ 'ప్రాజెక్ట్ కే' నుంచి దీపిక పదుకొణే ఫస్ట్ లుక్ విడుదల.. అంచనాలు పెంచేసిన నాయిక!
- సీరియస్ లుక్ లో ఆసక్తికరంగా దీపిక ఫస్ట్ లుక్
- ఈ నెల 20న అమెరికాలో సినిమా టైటిల్, గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్న మేకర్స్
- 'ప్రాజెక్ట్ కే'లో 'కే' అంటే కాలచక్రం అని ప్రచారం
రేపటి నుంచి యూఎస్ లోని శాన్ డియాగోలో కామిక్ కాన్ వేడుకలు జరగనున్నాయి. అక్కడే ఈ నెల 20న సినిమా టైటిల్ తో పాటు, గ్లింప్స్ కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించింది. ఈ కార్యక్రమంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపిక, నాగ్ అశ్విన్, అశ్వనీదత్ పాల్గొననున్నారు. మరోవైపు 'ప్రాజెక్ట్ కే'లో 'కే' అంటే కాలచక్రం అనే ప్రచారం జరుగుతోంది. ఇదే టైటిల్ ను ఫిక్స్ చేయొచ్చని కూడా సమాచారం.