నా తండ్రి అవినీతిపరుడు.. టిక్కెట్ ఇవ్వొద్దు: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కూతురు
- తన తండ్రిని ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారో తెలియదన్న తుల్జాభవానీ
- ఎమ్మెల్యేను ఓడించాల్సింది ప్రజలే అన్న ఎమ్మెల్యే కూతురు
- రాజకీయాలపై ఆసక్తి లేదని స్పష్టీకరణ
భూకబ్జా చేసినట్లు ఒక ఎమ్మెల్యే బహిరంగంగా చెప్పినప్పటికీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. ఇటువంటి అవినీతిపరులకు పార్టీ టిక్కెట్ ఇవ్వకూడదని, సొంతంగా పోటీ చేసినా సర్పంచ్‌గా కూడా తన తండ్రి గెలవలేడన్నారు. కేవలం కేసీఆర్ పేరు చెప్పుకొని ఎన్నికల్లో గెలిచారని విమర్శించారు. తనకు రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదని, తన వెనుక ఏ పార్టీ లేదని స్పష్టం చేశారు. కబ్జా చేసిన తన తండ్రిని వదిలేసి, తనపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. జనగామకు వెళ్లి అడిగితే తన తండ్రి గురించి ప్రతి ఒక్కరు చెబుతారన్నారు. ఇప్పుడిప్పుడే తన తండ్రి బాధితులు ఫోన్ చేస్తున్నారని, బయటకొస్తున్నారని ఆమె చెప్పారు.