ట్విట్టర్ ను ఊపేస్తున్న 'సలార్'.. టాప్ ట్రెండింగ్ లో ప్రభాస్ మూవీ టీజర్
- ఉదయం విడుదలైన 'సలార్' టీజర్
- భారీ యాక్షన్ సన్నివేశాలతో ఉత్కంఠను రేపుతున్న టీజర్
- ట్విట్టర్ లో లక్షలాది హిట్స్ తో వైరల్ అవుతున్న టీజర్
ఈ ఉదయం 5.12 గంటలకు టీజర్ ను విడుదల చేశారు. అందరూ ఊహించినట్టే ఈ చిత్రంలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. 'బాహుబలిని' మించి ప్రభాస్ ను ఎలివేట్ చేసేలా ఈ చిత్రం ఉందనే విషయం టీజర్ ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. మరోవైపు 'సలార్' టీజర్ ట్విట్టర్ ను షేక్ చేస్తోంది. టీజర్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వెంటనే వైరల్ అయింది. ట్విట్టర్ ఇండియాలో టాప్ పొజిషన్ ట్రెండ్ అవుతోంది. ప్రభాస్ కూడా టాప్ 2 పొజిషన్ లో ట్రెండ్ అవుతున్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 28న తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.
సలార్ ట్విట్టర్ ట్రెండింగ్:
