గుమ్మడికాయ కొట్టేసిన భోళా శంకర్!
- చిరంజీవి హీరోగా మెహెర్ రమేశ్ దర్శకత్వంలో సినిమా
- షూటింగ్ పూర్తయినట్లు ప్రకటించిన దర్శకుడు
- ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల
పగలు, రాత్రి అన్న తేడా లేకుండా సినిమా కోసం ఎంతగానో కష్టపడ్డ యూనిట్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నటీనటులు కూడా బాగా సహకరించారని చెప్పారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్పీడ్ లో కొనసాగుతున్నాయని తెలిపారు. ఇక ప్రమోషన్ కార్యక్రమాలు, సాంగ్స్ రిలీజ్ లకు సంబంధించిన పనే మిగిలి ఉందని తెలిపారు. ఈ సినిమా ఆగస్ట్ 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీవుతోంది. చిరు సరసన తమన్నా హీరోయిన్ గా నటించింది. కీర్తి సురేష్ మెగాస్టార్ చెల్లెలు పాత్ర పోషించింది. అక్కినేని సుశాంత్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు.