నా తమ్ముడి గురించి తెలియదు.. నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తా: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
- బీఆర్ఎస్ తో పొత్తు ఉండదన్న కోమటిరెడ్డి
- ఎప్పుడు రమ్మంటే అప్పుడు తెలంగాణకు రావడానికి రాహుల్ గాంధీ సిద్ధమన్న ఎంపీ
- వచ్చే నెలలో చాలా నియోజకవర్గాలకు అభ్యర్థుల ప్రకటన ఉంటుందని వెల్లడి
ఎప్పుడు రమ్మంటే అప్పుడు తెలంగాణకు రావడానికి సిద్ధమని రాహుల్ చెప్పారన్నారు. సర్వే ఆధారంగానే సీట్లు, టిక్కెట్ కేటాయింపు ఉంటుందని చెప్పారు. వచ్చే నెలలో చాలా నియోజకవర్గాలకు అభ్యర్థుల ప్రకటన ఉంటుందని చెప్పారు. కేసీఆర్ అవినీతి లెక్కలు బయటకు తీయాలని అగ్రనాయకత్వం సూచించిందన్నారు. కేసీఆర్ కుటుంబం అవినీతిని ప్రజల్లోకి తీసుకు వెళ్తామన్నారు.