బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూతురుపై కేసు నమోదు
- ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కూతురు తుల్జా భవానిపై కేసు నమోదు
- తన భూమి ఫెన్సింగ్ ను భవాని కూల్చేశారని పక్క స్థల యజమాని ఫిర్యాదు
- తన తండ్రే ఆయనతో కేసు పెట్టించారంటున్న భవాని
అంతేకాదు, చేర్యాల మున్సిపాలిటీకి తన భూమిని అప్పగించనున్నట్టు ప్రకటించారు. అయితే ఆ భూమి పక్కన ఉన్న తన భూమి ఫెన్సింగ్ ను కూడా ఆమె కూల్చేశారంటూ పక్క స్థల యజమాని రాజు భాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంకోవైపు, తన తండ్రే రాజు భాయ్ తో తనపై కేసు పెట్టించారని భవాని ఆరోపిస్తున్నారు.