‘ఎమర్జెన్సీ’లో అచ్చం ఇందిరను తలపిస్తున్న కంగన.. టీజర్ విడుదల
- దేశ నేత తన ప్రజలపైనే యుద్ధం ప్రకటించిన చీకటి చరిత్ర అంటూ ట్వీట్
- నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల
- సినిమాకి దర్శకురాలు, నిర్మాత అన్నీ కంగనాయే
ఈ సినిమాలో కంగన అచ్చం ఇందిరాగాంధీ మాదిరే కనిపిస్తుండడం గమనార్హం. ‘‘సంరక్షకురాలా, లేక నియంతా? మన దేశ నేత తన ప్రజలపైనే యుద్ధం ప్రకటించి నాటి రోజుల చీకటి చరిత్ర ఇది. ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 24న ఎమర్జెన్సీ విడుదల కానుంది’’ అంటూ నటి కంగనా రనౌత్ ట్విట్టర్ లో పేర్కొంది. ఈ సినిమాకి దర్శకత్వం, నిర్మాణం అన్నీ కంగనాయే కావడం గమనార్హం.