'లియో' నుంచి విజయ్ ఫస్టులుక్ పోస్టర్ రిలీజ్!
- విజయ్ 67వ సినిమాగా 'లియో'
- ఆయన జోడీకట్టిన త్రిష
- సంగీతాన్ని అందిస్తున్న అనిరుధ్
- భారీ తారాగణమే ప్రత్యేక ఆకర్షణ
- అక్టోబర్ 19వ తేదీన సినిమా విడుదల
ఈ రోజున విజయ్ బెర్త్ డే .. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ఆయన ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. మంచుకొండల నేపథ్యంలో బలమైన సుత్తినే ఆయుధంగా ఉపయోగిస్తూ ఆయన శత్రు సంహారం చేస్తున్నట్టుగా ఈ పోస్టర్ ఉంది. మంచుకొండల నేపథ్యంలో నడిచే కథ ఏమిటి? హీరో ఎందుకు అంత వైలెంట్ గా మారిపోయాడు? అనేది సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
విజయ్ - అనిరుధ్ కాంబినేషన్ ఇప్పుడు బాగా పాప్యులర్ అయింది. అందువలన ఈ ఇద్దరూ కలిసి చేయబోయే మ్యూజికల్ ఫీస్ట్ కోసం అభిమానులంతా వెయిట్ చేస్తున్నారు. బలమైన తారాగణం ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా కనిపిస్తోంది. ఆ జాబితాలో త్రిష .. సంజయ్ దత్ .. అర్జున్ .. ప్రియా ఆనంద్ .. గౌతమ్ మీనన్ .. మన్సూర్ అలీఖాన్ కనిపిస్తున్నారు. అక్టోబర్ 19వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.