‘ది కానిస్టేబుల్’ షూటింగ్లో గాయపడ్డ హీరో వరుణ్ సందేశ్
- ఫైట్ సీన్లు తెరకెక్కిస్తున్న సమయంలో వరుణ్ కాలికి గాయాలు
- మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన
- షూటింగ్ వాయిదా వేశామని దర్శకనిర్మాతల ప్రకటన
జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్‌పై వరుణ్ సందేశ్ కథానాయకుడిగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని బలగం జగదీశ్ నిర్మిస్తున్నారు. ఓ కానిస్టేబుల్ జీవితమే కథాంశంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం రెండో షెడ్యూల్ 40 శాతం పూర్తయ్యిందని నిర్మాత బలగం జగదీశ్ తెలిపారు. వరుణ్ పూర్తిగా కోలుకున్నాక చిత్రీకరణ ప్రారంభిస్తామని పేర్కొన్నారు.