ఈ వారం ఓటీటీలో తెలుగు సినిమాలివే!
- ఈ నెల 23న ఓటీటీ సినిమాల సందడి
- సోనీ లివ్ లో 'ఏజెంట్' స్ట్రీమింగ్
- 'ఆహా' వేదికపై 'మళ్లీ పెళ్లి'
- అదే ఫ్లాట్ ఫామ్ పైకి 'ఇంటింటి రామాయణం'
ఇక ఈ శుక్రవారం కూడా ఓటీటీ సెంటర్స్ లో సందడి కాస్త గట్టిగానే కనిపిస్తోంది. ఈ నెల 23వ తేదీన సోనీ లివ్ లో 'ఏజెంట్' సినిమా స్ట్రీమింగ్ కానుంది. అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి రూపొందించిన సినిమా ఇది. సాక్షి వైద్య కథానాయికగా పరిచయమైన ఈ సినిమా, తొలిరోజునే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది.
'ఇంటింటి రామాయణం' .. 'మళ్లీ పెళ్లి' సినిమాలు రెండూ కూడా ఈ నెల 23వ తేదీనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. మే 26వ తేదీన థియేటర్లకు వచ్చిన 'మళ్లీ పెళ్లి' .. జూన్ 9న వచ్చిన 'ఇంటింటి రామాయణం' ఈ రెండు కూడా 'ఆహా' ఫ్లాట్ ఫామ్ ద్వారా పలకరించనున్నాయి. ఈ రెండు సినిమాలు నరేశ్ ప్రధానమైన పాత్రగా కొనసాగుతాయి.