'టక్కర్' మూవీ మండే టాక్!
- ఈ నెల 9న విడుదలైన 'టక్కర్'
- సిద్ధార్థ్ జోడీకట్టిన దివ్యాన్ష కౌశిక్
- రెగ్యులర్ స్టోరీ అంటున్న ఆడియన్స్
- కథ ఎంపికలోనే పొరపాటు జరిగిపోయిందని వెల్లడి
ఈ సినిమా కోసం కాస్త గట్టిగానే ఖర్చు చేశారు. టైటిల్ కి తగినట్టుగానే యాక్షన్ సీన్స్ .. ఛేజింగ్స్ ఉన్నాయి. ఇక రొమాంటిక్ సీన్స్ కూడా అప్పుడప్పుడు తెరపైకి వచ్చి వెళుతూనే ఉంటాయి. ఈ సినిమాలో లవ్ ... కామెడీ .. యాక్షన్ .. రొమాన్స్ అన్నీ ఉన్నాయి కదా .. ఇంకా ఏంటి లోపం అనిపిస్తుంది.
పాత కథ ... పాత పద్ధతిలో నడవడమే ఈ సినిమాకి మైనస్ అయింది. ఈ సినిమా చూసిన ఆడియన్స్ ఇది ఒక రెగ్యులర్ స్టోరీ అంటున్నారు. సిద్ధార్థ్ యాక్టింగ్ .. దివ్యాన్ష గ్లామర్ ఆకట్టుకున్నా, కథలోనే దమ్ములేకపోవడం నిరాశపరిచిందని చెబుతున్నారు. ఈ కథను ఎంచుకోవడంలోనే మేకర్స్ పొరపాటు చేశారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.