ప్రముఖ సినీ నటుడు సురేశ్ గోపి కూతురిపై బాడీ షేమింగ్ కామెంట్లు
- కెనడాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన భాగ్య
- లావుగా ఉన్న వాళ్లకు చీరలు సెట్ కావన్న నెటిజన్
- మీ పనిపై దృష్టి పెడితే బాగుంటుందన్న భాగ్య
ఈ వ్యాఖ్యలపై భాగ్య స్పందిస్తూ... మీ ఉచిత సలహాలకు ధన్యవాదాలు అని రిప్లై ఇచ్చింది. తన బరువు ఇతరుల సమస్య కాదని... కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. ఇతర భారతీయ విద్యార్థుల మాదిరి పాశ్చాత్య సంస్కృతికి బలవంతంగా తలవంచే వ్యక్తిని తాను కాదని చెప్పింది. ఇతరుల శరీరాకృతి గురించి వ్యాఖ్యలు చేయకుండా... మీ పనిపై దృష్టి పెడితే బాగుంటుందని హితవు పలికింది. మరోవైపు సురేశ్ గోపి తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. ఆయన నటించిన ఎన్నో చిత్రాలు తెలుగులోకి అనువాదం అయ్యాయి.