అశ్విన్ కు తెలుగు క్లాస్ తీసుకున్న వికెట్ కీపర్ కేఎస్ భరత్
- ఓవల్ మైదానంలో రేపటి నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్
- కొత్త జెర్సీలతో టీమిండియా ఆటగాళ్ల ఫొటోషూట్
- అశ్విన్, భరత్ మధ్య సరదా సంభాషణ
ఒత్తిడికి గురవుతున్నావా అని భరత్ ను అశ్విన్ ప్రశ్నించగా... ఒత్తిడికి గురికావడం లేదు, మ్యాచ్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను, మేం బాగా ఆడి కప్ ఇంటికి తెస్తాం అని భరత్ తెలిపాడు.
అంతకుముందు భరత్ తమిళంలో మాట్లాడగా, అశ్విన్ ఎంజాయ్ చేశాడు. ఆ తర్వాత భరత్ ను అడిగి తెలుగు నేర్చుకునే ప్రయత్నం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట సందడి చేస్తోంది.