శరత్ బాబు మృతిపై ఆయన తొలి భార్య రమాప్రభ స్పందన
- అనారోగ్య కారణాలతో ఇటీవల మరణించిన శరత్ బాబు
- శాస్త్ర ప్రకారం అన్ని కార్యక్రమాలు చేస్తున్నానన్న రమాప్రభ
- హైందవ ధర్మ ప్రకారం అన్నీ పాటిస్తున్నానని వెల్లడి
మరోవైపు శరత్ బాబు మరణంపై రమాప్రభ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ద్వారా స్పందించారు. శరత్ బాబు మరణం తర్వాత తాను ప్రశాంతంగా కనిపిస్తూ ఉండొచ్చని... కానీ, శాస్త్ర ప్రకారం అన్ని కార్యక్రమాలను చేసుకుంటున్నానని ఆమె చెప్పారు. హైందవ ధర్మాచారం ప్రకారం అన్నీ పాటిస్తున్నానని తెలిపారు. సినిమాలలో శరత్ బాబుకు గొప్ప స్థాయి రావడానికి తానే కారణమని... దీన్ని మర్చిపోయి కొందరు తన గురించి ఏదేదో మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.