రాజేశ్, టీచర్ మృతి కేసును ఛేదించిన పోలీసులు
- హయత్ నగర్ రాజేశ్ మృతి కేసులో వెలుగులోకి షాకింగ్ విషయాలు
- 24న ఇద్దరూ చివరిసారి కలుసుకొని, పురుగుల మందు తాగి చనిపోవాలని నిర్ణయం
- టీచర్ పేరు మీద హయత్ నగర్ లో పురుగుల మందు కొనుగోలు
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి
టీచర్ పేరు మీద హయత్ నగర్ లోని ఒక షాప్ లో రాజేశ్ పురుగుల మందు కొనుగోలు చేశాడు. 24న ఇంటికి వెళ్లాక టీచర్ పురుగుల మందు తాగింది. అదే రోజు రాజేశ్ కూడా పురుగుల మందు తాగాడు. టీచర్ ను భర్త నాగేశ్వర రావు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రెండు రోజుల క్రితం మృతి చెందింది. రాజేశ్ కూడా చికిత్స పొందుతూ మృతి చెందాడు. వారిద్దరి ఫోన్లలో ఉన్న పూర్తి వివరాలతో పోలీసులు కేసును ఛేదించారు.