టైటిల్ కింద నిజమైన కథ అని రాయగానే సరిపోదు: ది కేరళ స్టోరీ చిత్రంపై కమల్ హాసన్ వ్యాఖ్యలు
- వివాదాలు రేకెత్తించిన 'ది కేరళ స్టోరీ' సినిమా
- తనకు పబ్లిసిటీ సినిమాలు నచ్చవన్న కమల్ హాసన్
- అలాంటి సినిమాలకు తాను వ్యతిరేకినని వెల్లడి
మే మొదటివారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ది కేరళ స్టోరీ' చిత్రం సంచలన విజయం అందుకుంది. లో బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.200 కోట్లకు పైగా వసూలు చేసింది. సుదీప్తో సేన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఆదా శర్మ, యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ, సోనియా బలానీ ప్రధానపాత్రల్లో నటించారు.