శరత్ బాబు ఆస్తులు ఎవరికి అనే విషయంలో ఆయన తమ్ముడు ఏం చెప్పారంటే.. !
- ఈ నెల 22న కన్నుమూసిన శరత్ బాబు
- శరత్ బాబు పేరిట భారీ ఆస్తులు
- విల్లులో ఏం రాసి ఉంటే దాని ప్రకారం వెళ్తామన్న తమ్ముడు మధు
మరోవైపు ఆస్తుల పంపకంపై శరత్ బాబు తమ్ముడు మధు మాట్లాడుతూ... ఆస్తుల పంపకాల గురించి ఇప్పుడు మాట్లాడటం సరికాదని అన్నారు. ఆయన విల్లు ఎలా రాస్తే, ఎవరికి రాస్తే వారికే ఆస్తులు చెందుతాయని చెప్పారు. అన్న ఆస్తి కోసం తాము తగువులాడుకోమని, తమది ఉమ్మడి కుటుంబమని, ఏం చేయాలో తమకు తెలుసని అన్నారు. 12వ రోజు పూర్తయిన తర్వాత లాకర్లు తెరిచి చూస్తామని... విల్లు రాసి ఉంటే దాని ప్రకారం వెళ్తామని, విల్లు రాయకపోతే ఏం చేయాలనేది అందరం కలిసి నిర్ణయించుకుంటామని చెప్పారు. విల్లులో ఒకరికి ఇచ్చి, మరొకరికి ఇవ్వకపోయినా ఏమీ అనుకోమని అన్నారు.