నాపై వస్తున్న పుకార్లను దయచేసి నమ్మకండి: సీనియర్ సినీ నటుడు సుధాకర్
- సుధాకర్ చనిపోయారంటూ సోషల్ మీడియాలో ప్రచారం
- తాను ఆరోగ్యంగానే ఉన్నానన్న సుధాకర్
- తనపై వస్తున్నవన్నీ తప్పుడు వార్తలేనని వ్యాఖ్య
మరోవైపు సుధాకర్ పై ఇలాంటి వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు. 2010లో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆ సమయంలో ఆయన కోమాలోకి కూడా వెళ్లారు. ఆయన చనిపోయారంటూ అప్పుడు కూడా తప్పుడు ప్రచారం జరిగింది. వైద్య చికిత్స అనంతరం ఆయన కోలుకున్నారు. ఇప్పుడు మరోసారి ఆయనపై అలాంటి ప్రచారమే జరుగుతోంది.