జీ 5లో అందుబాటులోకి వచ్చిన 'విడుదల పార్టు 1'
- తమిళంలో ప్రశంసలు అందుకున్న 'విడుదలై '
- తెలుగులోను మంచి మార్కులు తెచ్చుకున్న సినిమా
- నిన్నటి నుంచి తెలుగు వెర్షన్ అందుబాటులోకి
- ఇళయరాజా సంగీతం ప్రధానమైన ఆకర్షణ
ఆల్రెడీ ఈ సినిమా తమిళ వెర్షన్ జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది. నిన్నటి నుంచి తెలుగు వెర్షన్ ను అందుబాటులోకి తెచ్చారు. ఇక తెలుగు ప్రేక్షకులు జీ 5లో ఈ సినిమాను వీక్షించవచ్చు. వెట్రిమారన్ తనదైన స్టైల్లో సహజత్వానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఈ సినిమాను ఆవిష్కరించిన తీరు అభినందనలు అందుకుంది.
అడవికి సమీపంలోని ఒక గిరిజన గూడెం .. అక్కడి గిరిజనులపై పోలీస్ వారి ఆధిపత్యం .. వారిని ఎదిరించే ఒక తిరుగుబాటుదారుడు. తన ప్రేమ కోసం అతణ్ణి ఎదిరించడానికి ప్రయత్నించిన అమాయకుడైన పోలీస్ .. ఇదే ఈ సినిమా కథ. ఇళయరాజా సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఓటీటీ నుంచి ఈ సినిమా ఎన్ని మార్కులు రాబడుతుందో చూడాలి.