'విమానం' నుంచి అనసూయ లిరికల్ సాంగ్ రిలీజ్!
- ప్రధానమైన పాత్రను పోషించిన సముద్రఖని
- కీలకమైన పాత్రలో కనిపించనున్న అనసూయ
- జూన్ 9వ తేదీన సినిమా విడుదల
ఈ సినిమాలో సుమతి పాత్రలో అనసూయ కనిపించనుంది. ఆమె పాత్రపై సాగే పాట కూడా ఒకటుంది. కొంత సేపటి క్రితం ఆ పాటను రిలీజ్ చేశారు . 'సుమతీ .. సుమతీ .. నీ నడుములోని మడత చూస్తే ప్రాణమొనికే వనిత' అంటూ ఈ పాట సాగుతోంది.
ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చిన చరణ్ అర్జున్ ఈ పాటకి సాహిత్యాన్ని అందించడమే కాదు .. ఆయనే ఆలపించాడు కూడా. సముద్రఖని ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాను, జూన్ 9వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి సుమతి పాత్ర హైలైట్ గా నిలుస్తుందేమో చూడాలి.