సీబీఐకి మరో లేఖ రాసిన ఎంపీ అవినాశ్ రెడ్డి
- ఈ నెల 27 వరకు మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి
- సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ విచారణకు ఉందన్న ఎంపీ
- తల్లి అనారోగ్యం అంశాన్ని ప్రస్తావించిన అవినాశ్ రెడ్డి
సుప్రీంకోర్టు తన పిటిషన్ ను తిరస్కరించడంతో ఎంపీ అవినాశ్ రెడ్డి మరో మారు సీబీఐకి లేఖ రాశారు. సోమవారం మధ్యాహ్నం రాసిన ఈ లేఖలో.. తన తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న విషయాన్ని ఎంపీ ప్రస్తావించారు. తనకు మరికొంత సమయం కావాలని, ఈ నెల 27 వరకు విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈ నెల 27 తర్వాత ఏ రోజు అయినా విచారణకు అందుబాటులో ఉంటానని చెప్పారు. సుప్రీంకోర్టులో తన పిటిషన్ మంగళవారం విచారణకు రానుందని లేఖలో పేర్కొన్నారు. ఎంపీ అవినాశ్ రెడ్డి లేఖపై సీబీఐ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి!