చరణ్ ‘గేమ్ ఛేంజర్’ గురించి తాజా కబురు చెప్పిన శంకర్
- నిన్న రాత్రితో క్లైమాక్స్ పూర్తయిందని వెల్లడి
- ఇకపై ఇండియన్2 షూటింగ్ పై దృష్టి పెట్టనున్న శంకర్
- దిల్ రాజు నిర్మాణంలో ప్యాన్ ఇండియా చిత్రంగా గేమ్ ఛేంజర్
ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ పూర్తయిందని తెలిపారు. అద్భుతమైన క్లైమాక్స్ చిత్రీకరణ నిన్న పూర్తయిందని చెబుతూ రాత్రిపూట షూటింగ్ స్పాట్ లో తీసిన ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ రోజు నుంచి కమలహాసన్ హీరోగా వస్తున్న ‘ఇండియన్2’ షూటింగ్ పై పూర్తి ఫోకస్ పెడతానని ట్వీట్ చేశారు. శంకర్ చేతిలో ఉన్న ఈ రెండు క్రేజీ ప్రాజెక్టుల కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.