బాలినేని టీడీపీలోకి వెళ్తున్నారనే ప్రచారం జరుగుతోంది: గోనె ప్రకాశ్ రావు
- బాలినేనిని వందల కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలన్న గోనె
- వైవీ సుబ్బారెడ్డి దయవల్లే బాలినేని ఎమ్మెల్యే అయ్యారని వ్యాఖ్య
- వైవీ సుబ్బారెడ్డిని విమర్శించవద్దని సూచన
వైఎస్ రాజశేఖరరెడ్డి ఎదుగుదలలో కేవీపీ రామచంద్రరావు, వైవీ సుబ్బారెడ్డిల పాత్ర ఉందని చెప్పారు. వైవీ సుబ్బారెడ్డి దయవల్లే బాలినేని ఎమ్మెల్యే అయ్యారని అన్నారు. అలాంటి వైవీ సుబ్బారెడ్డిని ఆడిపోసుకోవద్దని సూచించారు. బాలినేని టీడీపీలోకి వెళ్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోందని అన్నారు. టీడీపీలోకి వెళ్తే వెళ్లండి కానీ... వైవీ సుబ్బారెడ్డిని మాత్రం విమర్శించవద్దని చెప్పారు.