కొడాలి నాని, వల్లభనేని వంశీలపై పోస్టులు.. టీడీపీ నాయకురాలు కల్యాణిపై కేసు నమోదు
- థాయ్ ల్యాండ్ లో అరెస్ట్ అయిన చికోటి ప్రవీణ్
- ప్రవీణ్ తో కొడాలి, వల్లభనేనికి సంబంధాలు ఉన్నాయంటూ కల్యాణి పోస్టులు
- కేసు నమోదు చేసిన హనుమాన్ జంక్షన్ పోలీసులు
ఇదిలావుంచితే, చికోటి అరెస్ట్ అయిన తరుణంలో టీడీపీ నాయకురాలు, తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి సాయి కల్యాణి సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. చికోటి ప్రవీణ్ తో కొడాలి నానికి, వల్లభనేని వంశీకి సంబంధాలు ఉన్నాయని ఆమె కామెంట్ చేశారు. ఈ క్రమంలో ఆమెపై వైసీపీకి చెందిన ప్రదీప్ అనే కార్యకర్త హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.