అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా
- ఉదయం హియరింగ్ కు అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్
- సుప్రీం ఆర్డర్ కాపీ లేకపోవడంతో మధ్యాహ్నానికి వాయిదా వేసిన కోర్టు
- రేపు వాదనలు వింటామన్న తెలంగాణ హైకోర్టు
ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఈ కేసు హియరింగ్ కు వచ్చింది. ఇవాళ త్వరగా విచారణ జరపాలని అవినాశ్ తరఫు న్యాయవాది హైకోర్టును కోరారు. అయితే సుప్రీం కోర్టు సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల ప్రతి ఇంకా అందలేదని ఈ సందర్భంగా న్యాయమూర్తికి తెలిపారు. సుప్రీం కోర్టు డాక్యుమెంట్స్ లేకుండా విచారణ కొనసాగించలేమని, సుప్రీం ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగా విచారణ ఉంటుందని జడ్జి తెలిపారు. అయితే మధ్యాహ్నం సుప్రీం ఉత్తర్వులు సమర్పిస్తామని అవినాశ్ తరఫు లాయర్ తెలిపారు.
దీంతో ఉదయం వచ్చిన హియరింగ్ ఆర్డర్ కాపీ లేకపోవడంతో మధ్యాహ్నానికి వాయిదా పడింది. మధ్యాహ్నం గం.2.30కు విచారణ జరుపుతామని న్యాయమూర్తి తెలిపారు. వాదనలు వినే క్రమంలో ఈ పిటిషన్ ను రేపు విచారిస్తామని న్యాయమూర్తి తెలిపారు. ప్రధానంగా ఆర్డర్ కాపీ ఆలస్యం కావడంతో విచారణ రేపటికి వాయిదా పడింది. అయితే హైకోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ అందరిలో నెలకొంది.