అఖిల్ కి ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువ: నాగార్జున
- వరంగల్ వేదికగా జరిగిన 'ఏజెంట్' ఈవెంట్
- ముఖ్య అతిథిగా హాజరైన నాగార్జున
- మమ్ముట్టి ఒప్పుకోవడంతోనే సగం సక్సెస్ అయిందన్న నాగ్
- అఖిల్ కష్టం తనకి తెలుసని వ్యాఖ్య
"నిజంగా నాకు ఈ సినిమా కథ తెలియదు .. సినిమా నేను చూడలేదు. అప్పుడప్పుడు అఖిల్ ఇంటికి వచ్చి చెబుతుంటే వినేవాడిని. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడానికి ఏయే అంశాలు ఉండాలో ఆ అంశాలన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. మమ్ముట్టి గారు ఈ సినిమా ఒప్పుకోవడాన్ని బట్టి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని అనిపిస్తోంది. సాక్షి వైద్య కెరియర్ కి ఈ సినిమా హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను" అని అన్నారు.
"అఖిల్ ఎనర్జీ మీరంతా ఇప్పుడు చూస్తున్నారు. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. ఆ ఎనర్జీని ఈ సినిమా కోసం సురేందర్ రెడ్డి బయటికి తీశారు. సిక్స్ ప్యాక్ కోసం అఖిల్ పడిన కష్టాలను నేను చూస్తూనే వచ్చాను. మా వయసులో ఇలాంటి కష్టాలు లేకపోవడం వలన హమ్మయ్య అనుకున్నాను. అక్కినేని అభిమానులు చూపిస్తున్న ప్రేమవలన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్ముతున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.