20 ఏళ్ల తర్వాత చిరంజీవితో శ్రియ స్టెప్పులు
- భోళా శంకర్ లో శ్రియ స్పెషల్ సాంగ్
- 2003లో ఠాగూర్ లో చిరు సరసన నటించిన హీరోయిన్
- ఇన్నాళ్ల తర్వాత మళ్లీ కలిసి పని చేయబోతున్న శ్రియ, చిరు
చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ తీస్తున్న ‘భోళా శంకర్’ చిత్రంలోని ఐటం సాంగ్ కోసం శ్రియను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. చాలా మందిని సంప్రదించిన తర్వాత చిరుతో పోటాపోటీగా నర్తించేది శ్రియనే అని చిత్ర బృందం నిర్ణయానికి వచ్చిందని వినికిడి. ఈ ఆఫర్ కు వెంటనే ఒప్పుకున్న శ్రియ చిరుతో కాలు కదపడానికి రెడీ అయినట్టు తెలుస్తోంది. పలు చిత్రాల్లో ఇప్పటికే పదుల సంఖ్యలో స్పెషల్ సాంగ్స్ చేసిన శ్రియతో మెగాస్టార్ తో స్పెషల్ నంబర్ మరింత ప్రత్యేకంగా ఉండనుంది. ఈ పాట కోసం శ్రియా రూ. కోటి పారితోషికం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.