వెంకీ, సల్మాన్ కోసం డీఎస్పీ హుషారైన పాట
- కిసీకా భాయ్ కిసికా జాన్ చిత్రంలో నటించిన వెంకీ, సల్మాన్
- ‘లెట్స్ డ్యాన్స్ చోటు మోటు’ పాటకు దేవిశ్రీ స్వరాలు
- రేపు విడుదల కాబోతున్న కొత్త సినిమా
ఆర్ఆర్ఆర్ చిత్రంతో వరల్డ్ వైడ్ పేరు తెచ్చుకున్న రామ్ చరణ్ ఇందులో అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఓ పాటలో సల్మాన్, వెంకీ, పూజాతో కలిసి స్టెప్పులు వేశాడు. తాజాగా ఈ సినిమా నుంచి మరో పాటను చిత్ర బృందం విడుదల చేసింది. ‘లెట్స్ డ్యాన్స్ చోటు మోటు’ అనే పాటకు సౌతిండియా స్టయిల్లో సల్మాన్, వెంకీ లుంగీ, చొక్కా వేసుకొని హుషారుగా స్టెప్పులు వేశారు. ఈ పాటకు మరో ప్రత్యేకత ఉంది. చిత్రం కోసం సౌత్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ (డీఎస్పీ) దీన్ని కంపోజ్ చేశారు. పాటను కూడా ఆయనే ఆలపించారు.