రాజమౌళి సినిమాలో మహేశ్ పాత్రపై వస్తున్నవన్నీ పుకార్లే: విజయేంద్ర ప్రసాద్
- రాజమౌళి దర్శకత్వంలో తన 29వ సినిమా చేయనున్న మహేశ్
- ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి తదుపరి ప్రాజెక్టుపై విపరీతమైన క్రేజ్
- ఇందులోని మహేశ్ పాత్ర హనుమంతుడిని పోలి ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం
ఇక ఈ చిత్రంలో హీరో మహేశ్ పాత్రను హనుమంతుడు స్ఫూర్తితో రాశారన్న వార్త కొన్ని రోజులుగా హల్ చల్ చేస్తోంది. దీనిపై రాజమౌళి తండ్రి, కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ స్పందించారు. ‘రాజమౌళికి పౌరాణిక కథలు ఇష్టం. వాటి నుంచి ప్రేరణ పొందుతాడు. తన చిత్రాలు భారతీయ సంస్కృతికి అనుగుణంగా ఉంటాయి. రాబోతున్న ‘ఎస్ఎస్ఎంబీ29’ కూడా అలాగే ఉంటుంది. కానీ, మహేశ్‌బాబు పాత్ర హనుమాన్ స్ఫూర్తితో ఉండదు. అలాగే ఏ పౌరాణిక పాత్రతోనూ పోలి ఉండదు’ అని స్పష్టం చేశారు. అది పుకారు మాత్రమే అని తేల్చారు. కాగా, రాజమౌళి–మహేశ్ చిత్రంలో హీరోయిన్ ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు ఇంకా ఖరారు కాలేదు.