ఎన్టీఆర్30లో తారక్ డబుల్ ధమాకా!
- కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న తారక్
- హీరోయిన గా జాన్వీ కపూర్
- హైదరాబాద్ లో తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తి
అయితే, ఈ సినిమాకు సంబంధించిన తాజా సమాచారం ఒకటి బయటికి వచ్చింది. ఇందులో తారక్ ద్విపాత్రాభినయం చేస్తారని టాక్. సముద్ర తీరప్రాంత ప్రజల నేపథ్యంలో సాగే కథానుగుణంగా తారక్ తండ్రీ కొడుకల పాత్రల్లో కనిపిస్తారని టాలీవుడ్ సమాచారం. దీని గురించి చిత్ర బృందం అధికారిక ప్రకటన అయితే చేయలేదు. తారక్ కు ద్విపాత్రాభినయం కొత్తేం కాదు. ఆంధ్రావాలా, అదుర్స్ చిత్రాల్లో రెండు పాత్రల్లో ‘జై లవకుశ’లో ఏకంగా మూడు పాత్రల్లో నటించి మెప్పించారు. కల్యాణ్ రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, కె.హరికృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.