ప్రమాదంలో నాకు మాట పడిపోయింది తెలుసా?: సాయితేజ్
- తనకి జరిగిన ప్రమాదం గురించి ప్రస్తావించిన సాయితేజ్
- ఆ షాక్ లో మాట పోయిందని వెల్లడి
- ఆ సమయంలో మాట విలువ తెలిసిందని వ్యాఖ్య
- డైలాగ్స్ చెప్పడానికి ఇబ్బంది పడ్డానని వివరణ
- తన ప్రయాణం మళ్లీ మొదలైందన్న సాయితేజ్
తాజాగా 'గ్రేట్ ఆంధ్ర'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయితేజ్ మాట్లాడుతూ .. "బైక్ పై నుంచి నేను పడిపోయినప్పుడు ఆ షాక్ లో నాకు మాట పడిపోయింది. మాట పడిపోయిన తరువాత నాకు మాట విలువ తెలిసింది. ఎప్పటిలా మాట్లాడాలనే తపన ఎంతగానో ఉండేది. ఆ సమయంలో మాట్లాడానికి ట్రై చేయడనికి నేను ఎంత కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసు" అన్నాడు.
"ఈ ప్రమాదం జరగడానికి ముందు 'రిపబ్లిక్' సినిమాలో 4 పేజీల డైలాగులను ఏకధాటిగా చెప్పాను. కానీ 'విరూపాక్ష' సినిమా షూటింగులో హాఫ్ పేజీ డైలాగులను కూడా చెప్పలేక అవస్థలు పడ్డాను. ఆ సమయంలో తోటి ఆర్టిస్టులు చాలా సపోర్ట్ చేశారు. కొన్ని సార్లు పెదాలను మాత్రమే కదిలించిన సందర్భాలు ఉన్నాయి. ప్రమాదం తరువాత హీరోగా నా జర్నీ మొదటిమెట్టు నుంచి మొదలుపెట్టినట్టుగానే ఉంది" అంటూ చెప్పుకొచ్చాడు.