ధోనీపై బాలకృష్ణ స్పెషల్ ప్రోమో... వీడియో ఇదిగో!
- వినోదభరితంగా సాగుతున్న ఐపీఎల్-16
- నేడు సీఎస్కే, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్
- ధోనీ విశిష్టతలను వివరించిన బాలయ్య
- వీడియో విడుదల చేసిన స్టార్ స్పోర్ట్స్ తెలుగు
"15 ఏళ్ల కిందట ఓ సూర్యుడు పసుపు రంగు జెర్సీ ధరించి మనందరి జీవితాల్లో ఉదయించాడు. ఆ నెం.7 జెర్సీతో మనం కనెక్ట్ అయినప్పుడు జట్టులోకే కాదు నేరుగా మన గుండెల్లోకే ప్రవేశించాడు. అతడి టాలెంట్ వల్ల బెస్టాఫ్ ద బెస్ట్ కూడా అతడిని ఓడించలేకపోయింది. అతడు వికెట్ల వెనుక... మనం టీవీ సెట్ల ముందు... అలా ఆటను నడిపించాడు. కొందరికి మహి... కొందరికి కెప్టెన్ కూల్. ఆ తర్వాత 'తాలా' అయ్యాడు.
గెలిపించిన వాడు, ఏడ్పించిన వాడు, నవ్వించిన వాడు... కానీ ఓటమిని అంగీకరించడం మాత్రం నేర్పలేదు.. మనమే కాదు, ప్రత్యర్థులు కూడా అభిమానించే ఆటగాడు.... ఇవీ ఆయన గురించి కొన్ని అద్భుత క్షణాలు! ఇలాంటి అద్భుత క్షణాలను లెక్కలేనన్ని అందించినందుకు ధన్యవాదాలు తాలా... ఎల్లప్పుడూ 7" అంటూ బాలయ్య తనదైన శైలిలో ప్రోమోను రక్తి కట్టించారు.