గ్లోబల్ పాపులర్ లీడర్ గా మరోమారు మోదీ
- 76 శాతం ఓటింగ్ తో టాప్ ప్లేస్
- మొత్తంగా 22 మంది లీడర్లతో ‘మార్నింగ్ కన్సల్ట్’ జాబితా
- ఆరో స్థానంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్
గ్లోబల్ లీడర్ల జాబితాలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరో స్థానంలో నిలవడం గమనార్హం. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఈ జాబితాలో పన్నెండో స్థానంలో నిలిచారు. 22 మంది గ్లోబల్ లీడర్ల పేర్లతో విడుదల చేసిన ఈ జాబితాలో సౌత్ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ చివరి స్థానంలో ఉన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ తర్వాతి స్థానంలో వరుసగా మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఓబ్రడార్ (61శాతం), ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ (55 శాతం), ఇటలీ ప్రధాని మెలొని (49 శాతం), బ్రెజిల్ అధ్యక్షుడు లులా డా సిల్వా (49 శాతం), అమెరికా అధ్యక్షుడు బైడెన్ (41 శాతం), కెనడా ప్రధాని ట్రూడో (39 శాతం), స్పెయిన్ ప్రధాని షాంచెజ్ (38 శాతం), జర్మనీ చాన్సలర్ షోల్జ్ (35 శాతం), బ్రిటన్ ప్రధాని సునాక్ (34 శాతం) తదితరులు ఉన్నారు.