'దసరా' సినిమా రెండు రోజుల వసూళ్లు ఇవే!
- క్రితం నెల 30వ తేదీన విడుదలైన 'దసరా'
- తొలి రోజునే 38 కోట్లకి పైగా గ్రాస్
- రెండో రోజుతో 53 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు
- వీకెండ్ లో 100 కోట్ల క్లబ్ లోకి చేరే ఛాన్స్
అలాంటి అవకాశం ఆయనకి 'దసరా' సినిమాతో లభించింది. లుక్ పరంగా .. యాస పరంగా .. కథా పరంగా ఈ సినిమా ఆయనలోని మాస్ హీరోను తట్టి లేపింది. మాస్ రోల్ ను నాని ఈ స్థాయిలో చేస్తాడని ఎవరూ గెస్ చేయలేదు కూడా. అంతగా ఆయన ధరణి అనే పాత్రలో ఇమిడిపోయాడు.
క్రితం నెల 30వ తేదీన విడుదలైన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా తొలి రోజునే 38 కోట్లకి పైగా గ్రాస్ ను వసూలు చేసింది. రెండో రోజుతో కలుపుకుంటే 53 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. చూస్తుంటే ఈ వీకెండ్ లోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరేలా ఉంది.