'శాకుంతలం' నుంచి బ్యూటిఫుల్ వీడియో సాంగ్!
- సమంత టైటిల్ రోల్ ను పోషించిన 'శాకుంతలం'
- దర్శకుడిగా గుణశేఖర్ చేసిన మరో ప్రయోగం
- ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న మణిశర్మ సంగీతం
- ఏప్రిల్ 14వ తేదీన సినిమా విడుదల
కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి 1:12 నిమిషాల నిడివిగల వీడియో సాంగును విడుదల చేశారు. 'మల్లికా మల్లికా మాలతీ మాలిక .. చూడవా చూడవా ఏడే నా ఏలికా' అంటూ ఈ పాట సాగుతోంది. మణిశర్మ స్వరపరిచిన ఈ పాటను రమ్య బెహ్రా మధురంగా ఆలపించింది. గుణశేఖర్ అద్భుతంగా ఈ పాటను చిత్రీకరించారు.
దుష్యంతుడి కోసం ఎదురుచూస్తూ శకుంతల పాడుకునే పాటగా ఇది తెరపైకి రానుంది. దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించిన ఈ సినిమాలో, మోహన్ బాబు .. ప్రకాశ్ రాజ్ .. గౌతమి ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమైన ఈ సినిమా, కొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు.