త్రివిక్రమ్–మహేశ్ సినిమా కోసం బుట్టబొమ్మ వచ్చేసింది
- అతడు, ఖలేజా తర్వాత త్రివిక్రమ్ తో మహేశ్ మూడో చిత్రం
- హైదరాబాద్ లో భారీ సెట్ లో శరవేగంగా షూటింగ్
- ఆగస్టు 11న విడుదల కానున్న చిత్రం
ఈ చిత్రంలో మలయాళ నటుడు జయరామ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. త్రివిక్రమ్–అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ అలవైకుంఠపురములో చిత్రంలో జయరామ్ పాత్ర ఆకట్టుకుంది. ఇప్పుడు మహేష్ సినిమాలో నటిస్తున్నందుకు ఆయన చాలా ఉత్సాహంగా ఉన్నారు. హైదరాబాద్ సెట్లో మహేష్, త్రివిక్రమ్ తో దిగిన ఫొటోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘థియేటర్లలో కృష్ణ గారి సినిమాలు చూస్తూ పెరిగాను. ఇప్పుడు ఆయన కొడుకు మహేష్ తో పని చేస్తున్నాను. మరోసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించడం సంతోషంగా ఉంది’ అని పేర్కొన్నారు. ఉగాది కానుకగా.. ఈ సినిమా టైటిల్, మహేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేస్తారని తెలుస్తోంది. భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రాన్ని అమెరికాలో ప్రత్యంగిర సినిమాస్ సంస్థ విడుదల చేయనుంది.