వంద మందితో ప్రభుదేవా నాటు నాటు స్టెప్పులు.. వీడియో ఇదిగో!
- ఆస్కార్ అందుకున్న ఆర్ఆర్ఆర్ కు తనదైన స్టయిల్లో అభినందన
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
- ప్రభుదేవాకు కృతజ్ఞతలు తెలిపిన ఆర్ఆర్ఆర్ బృందం
స్టూడియోలో వంద మందితో కూడిన తన బృందంతో ప్రభుదేవా నాటునాటు హూక్ స్టెప్పులు వేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి ఆర్ఆర్ఆర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుదేవా ఆయన బృందం హుషారుగా చేసిన నాటు నాటు స్టెప్పు వీడియో వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం.. థ్యాంక్యూ లెజెండ్ అని ట్వీట్ చేసింది.